

రెపల్లె మునిసిపాలిటీ పరిధిలోని ఆంధ్ర రత్న మునిసిపల్ హై స్కూల్లో నషా ముఖ్త్ భారత్ అభియాన్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించాము.
పిల్లల్లో, యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల అలవాట్లపై అవగాహన కల్పించడం, మాదక వసతుల వినియోగాన్ని పూర్తిగా నిరోధించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యo
కార్యక్రమంలో విద్యార్థులకు
మత్తు పదార్థాలు, గుట్కా, మద్యం వలన కలిగే శారీరక – మానసిక దుష్ప్రభావాలు,
వ్యసనం కుటుంబం, చదువు, భవిష్యత్తుపై చూపే ప్రభావo
ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాల్సిన అవసరం
వంటి అంశాలపై సవివరంగా అవగాహన కల్పించబడింది.
తరువాత విద్యార్థులందరికీ “నషా ముఖ్త్ భారత్” ప్రమాణం చదివించి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించబడింది.
పాల్గొన్నవారు:
మారుపూడి సుచిత్ర – CDPO, రెపల్లె ప్రాజెక్ట్
సి.హెచ్. హిమబిందు – సూపర్వైజర్
ఆర్ మాధవి – స్కూల్ టీచర్
కుమారి- స్కూల్ టీచర్
ఇతర మునిసిపల్ హై స్కూల్ టీచర్స్, విద్యార్థిని విద్యార్థులు…








