
Guntur:పొన్నూరు: నవంబర్ 29:-నాట్కో ఫార్మా లిమిటెడ్ చైర్మన్ నన్నపనేని వెంకయ్య చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకుని నాట్కో ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని గోళ్ళముడిపాడు గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్‌ను శనివారం నిర్వహించారు. నాట్కో స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ క్యాంప్‌లో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, బృంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందాలు పాలుపంచుకున్నాయి.క్యాంప్‌లో కంటి పరీక్షలు, కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ, థైరాయిడ్ తదితర వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.
అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. కంటి సంబంధిత సమస్యలకు డాక్టర్లు ప్రత్యక్షంగా పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్ళు అందించనున్నట్టు, ఆపరేషన్లు కూడా పూర్తిగా ఉచితంగా చేపట్టనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.ఈ మెగా క్యాంప్‌లో మొత్తం 357 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, అందులోకంటి పరీక్షలు: 283 మందిజనరల్ చెకప్: 109 మందిఎముకలు, కాళ్ల నొప్పులు: 138 మంది పాల్గొన్నారు.

క్యాంప్ ద్వారా 189 మంది కంటి సమస్యలు, 50 మంది సర్జరీలకు అవసరమైనవారిగా గుర్తించి, వారికి నాట్కో ట్రస్ట్ తరఫున ఉచిత కళ్లద్దాలు, అవసరమైన శస్త్రచికిత్సలు ఉచితంగా అందించనున్నట్టు నాట్కో ట్రస్ట్ కోఆర్డినేటర్ రమణా రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ పి. లక్ష్మణాచార్యులు రిబ్బన్ కటింగ్ చేసి క్యాంప్‌ను ప్రారంభించారు.







