ఈ రోజు పిట్టలవానిపాలెం లో గల కేర్ యోగ, నేచురోపతి మెడికల్ కాలేజ్ విద్యార్థులకు రహదరి భద్రత పై అవగహన సదస్సు జరిగింది. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ టి. కె. పరంధామ రెడ్డి అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు రోడ్ రుల్స్ పాటిస్తూ మిగిలిన వారికి ఆదర్శప్రాయం గా ఉండాలని తెలిపారు. యువత ఎక్కువగా ఆక్సిడెంట్స్ కి గురి అవుతున్నారని, రోడ్ రూల్స్ పాటించకపోవడమే దీనికి కారణమని అన్నారు. చట్టాలు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని వాటిని గౌరవించాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఆయన అన్నారు. 2 వీలర్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని, 4 వీలర్ నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చెయ్యడం అత్యంత ప్రమాదకరమని ఆయన విద్యార్థులకు వివరించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి.బి. వి. రంగా రావు మాట్లాడుతూ డ్రైవింగ్ లైసన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని అయన తెలిపారు. ఆక్సిడెంట్స్ జరగడానికి గల పలు కారణాలను ఎం.వి.ఐ విద్యార్థులకు వివరించారు. రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ ఫస్ట్ ఎయిడ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమం లో స్కైకాలజిస్ట్ శ్రీమన్నారాయణ, కాలేజ్ మానేజ్మెంట్ కిషోర్ రాజు, కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సౌమ్య మహేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
232 1 minute read