

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఈరోజు బాపట్ల శాఖ గ్రంధాలయం నందు జరిగి ఉన్నది. ఈ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేగేశ్న నరేంద్ర వర్మ రాజు గారు ఇచ్చేసి ఉన్నారు .అనంతరం జరిగిన సభకు గ్రంథాలయ అధికారి ఏ .శివాజీ గణేషన్ అధ్యక్షత వహించి ఉన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి నిర్వహించిన కార్యక్రమాలను వాటి ఆవశ్యకతను సభకు తెలిపి ఉన్నారు. అనంతరం శ్రీ వేగేసిన నరేంద్ర వర్మ రాజు గారు ప్రసంగిస్తూ గ్రంథాలయాలు అంటే విజ్ఞాన కేంద్రాలని తప్పనిసరిగా విద్యార్థినీ విద్యార్థులు వారి ఖాళీ సమయాలలో పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను కూడా చదువుకొని ఉన్నత స్థానానికి రావలసిందిగా చెప్పి ఉన్నారు. నేటి యువత సెల్ ఫోన్స్ ఆకర్షితులై పఠనాశక్తిని తగ్గించుకుంటున్నారని అలా కాకుండా గ్రంధాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న పుస్తకాలను చదువుకొని ఉన్నత స్థితికి రావాలని తెలిపి ఉన్నారు. అనంతరం గ్రంధాలయానికి నూతన భవనం తప్పనిసరిగా నిర్మిద్దామని చెప్పి ఉన్నారు . ఏ వి వి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సత్యవతి గారు విద్యార్థిని విద్యార్థులు అందరూ గ్రంథాలయంలో సభ్యత్వాన్ని తీసుకొని అక్కడున్న పుస్తకాలు చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని తెలిపి ఉన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ వేజెండ్ల శ్రీనివాసరావు గారు గ్రంధాలయాలు నిరుద్యోగులకు వారి జీవితంలో ఉన్నత స్థితికి చేరటానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపి ఉన్నారు. ప్రముఖ రచయిత భవానీ దేవి గారు వారోత్సవాలు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థిని విద్యార్థులకు తెలిపి ఉన్నారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశ్న నరేంద్ర వర్మ గారి చేత బహుమతులు అందించుకున్నాము, మరియు వచ్చిన పెద్దలందరూ కూడా గ్రంథాలయాల ఆవశ్యకతను తెలిపి ఉన్నారు .ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చేపల సుబ్రహ్మణ్యం గారు కార్యదర్శి శేషాద్రి నాయుడు గారు కళ్ళం హరినాథ్ రెడ్డి గారు శీలం శ్రీనివాసరావు గారు శ్రీమన్నారాయణ గారు బుర్లి రామ సుబ్బారావు గారు జి వి గారు కోట వెంకటేశ్వర్ రెడ్డి గారు వివిధ స్కూల్స్ చెందిన టీచర్స్ పట్టణ పెద్దలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం గ్రంథాలయ అధికారి ఈ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించటానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి ఉన్నారు.







