Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
అమరావతిఆంధ్రప్రదేశ్

AMARAVATHI NEWS:అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన నాయుడుపేట సభలో సీఎం చంద్రబాబు నాయుడు

నాయుడుపేట: రాష్ట్రంలో సంపద సృష్టించి, పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ విధ్వంసకర పాలన వల్ల అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమతూకంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని, అందులో భాగంగా ఈ ఏడాది జూన్ నాటికి 2 లక్షలు, సెప్టెంబర్ నాటికి మరో 1.60 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. ‘దీపం 2.0’ పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని, భవిష్యత్తులో ఇంటింటికీ పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామని వెల్లడించారు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందిస్తామని, సౌర ఫలకాల ద్వారా ఉచిత విద్యుత్ పొందేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, వచ్చే ఏడాదికి 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ ద్వారా వారి ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని సీఎం అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, 63 లక్షల మందికి పెన్షన్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, అమరావతికి చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం వేట నిషేధ కాలంలో ఇచ్చే సాయాన్ని రూ. 20 వేలకు పెంచామని, స్థానిక మత్స్యకారుల ప్రయోజనాల కోసం నిఘా బోట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

పాలనలో జవాబుదారీతనం పెంచేందుకు ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని, సేవల్లో అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయుడుపేట రిజిస్ట్రేషన్ శాఖలో లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశించారు. రాజకీయాల్లో విధ్వంసం చేసే వారిని ప్రజలు దూరం పెట్టాలని, సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టుల ద్వారా మహిళలను అవమానించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో నిష్కళంకమైన సేవ అందించానని, గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించినా ప్రజల ఆశీస్సులతో సంక్షేమ బాటలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.http://AMARAVATHI NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker