
మంగళగిరి:-ఆత్మకూరు:నవంబర్ 4:-రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి మరియు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ ఈరోజు ఉదయం 8:30 గంటలకు మంగళగిరి ఆత్మకూరు లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, ప్రజల ఆవేదనలను తెలుసుకోనున్నారు. ప్రతి పౌరుడి సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెబుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.ప్రజా దర్బార్ కు ప్రాంతీయ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.
 
 






