
విశాఖపట్నం, అక్టోబర్ 12:విద్య, సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ నేడు విశాఖపట్నం పర్యటన చేపట్టారు. ఉదయం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రుషికొండలోని హిల్ నెంబర్-3 ప్రాంతంలో ఏర్పాటు కానున్న సిఫీ (Sify) సంస్థ ఆధ్వర్యంలో నిర్మించబోయే ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS) ప్రాజెక్ట్‌కు కూడా శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టులు విశాఖపట్నంలో డిజిటల్ మౌలికసదుపాయాలను మరింతగా అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేష్ కలెక్టరేట్‌కి వెళ్లి జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పాలనాపరమైన సమస్యలపై చర్చించి, పరిష్కార మార్గాలను సూచించే అవకాశం ఉంది.మధ్యాహ్నం మంత్రి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంకు వెళ్లి, మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా జరుగనున్న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు







