
నెల్లూరు: నగరంలోని భగత్ సింగ్ కాలనీలో ఉన్న సాని మష్ కురియా మసీదులో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ‘ఫైజానె రంజాన్’ దావతె ఇఫ్తార్ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఆస్థానం మష్కురియా దర్గా పీఠాధిపతులు హజరత్ సయ్యద్ షా సాని సాహెబ్ ఖిబ్లా సజ్జదాగాన్ సయ్యద్ తన్వీర్ సాహెబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక నమాజ్, బయాన్ (మత బోధన) మరియు సలాం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూఫీ మత గురువులు మాట్లాడుతూ, రంజాన్ ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదించే పుణ్యమాసమని, ఖురాన్ ఆవిర్భవించిన ఈ నెలలో ఉపవాస దీక్షలు, జకాత్ మరియు ఫిత్రా రూపంలో పేదలకు చేసే సహాయం అల్లాహ్ కరుణకు పాత్రులని చేస్తుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలని ప్రత్యేక దువా నిర్వహించిన అనంతరం, ఆస్థానం మస్కురియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. రంజాన్ అంటేనే సమానత్వం మరియు ఐక్యతకు చిహ్నమని చాటుతూ ముస్లిం సోదరులు పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.Nellore local news:అనంతసాగరంలో ఆస్తాన ఏ మష్ కూరియాలో జల్స-ఎ-గ్యార్మి ఘనంగా







