
గుంటూరు, జనవరి 31 :-చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే లక్ష్యంతో విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాల మహోత్సవ్ “విజ్ఞాన్ బాల మహోత్సవ్–2కే26” నేటి నుంచి మూడు రోజుల పాటు ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని వర్సిటీ ఇంచార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్ వెల్లడించారు.

నేటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా (ఐఏఎస్), విశాఖపట్నంలోని వాల్తేరు డివిజన్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ భవ్య వట్టికూటి (ఐఆర్‌ఎంఎస్) హాజరుకానున్నారు. ఫిబ్రవరి 2న జరిగే ముగింపు వేడుకలకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లవరపు సూర్యతేజ (ఐఆర్‌ఎంఎస్) ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్ మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాల్లో చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించేందుకే ఈ బాల మహోత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
50కు పైగా ఈవెంట్లు
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ కార్యక్రమంలో జూనియర్స్ (అండర్–14 : 5వ నుంచి 7వ తరగతి) మరియు సీనియర్స్ (అండర్–17 : 8వ నుంచి 10వ తరగతి) విభాగాల్లో 50కు పైగా పోటీలు నిర్వహించనున్నారు.

క్రీడా పోటీలు: వాలీబాల్, కబడ్డీ, ఖో–ఖో, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, చెస్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి.
నృత్య–సంగీత విభాగం: క్లాసికల్, ఫోక్, వెస్ట్రన్ డాన్స్‌లు, కర్ణాటిక్ వోకల్, సింగింగ్ ఐడల్, గ్రూప్ సింగింగ్, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ సోలో పోటీలు ఉంటాయి.
నాటక–సాహిత్య విభాగం: స్కిట్, మైమ్, ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, స్టోరీ టెల్లింగ్, స్పెల్‌బీ పోటీలు నిర్వహిస్తారు.
సృజనాత్మక కళలు – ఫ్యాషన్: ఆన్ ద స్పాట్ పెయింటింగ్, క్లే మోడలింగ్, ట్రెడిషనల్ అండ్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Guntur Local Newsరిజిస్ట్రేషన్లు ప్రారంభం
డాన్స్, మ్యూజిక్, డ్రామాటిక్స్ కోసం సీహెచ్ సాత్విక్ (7382261632), బీ.రోషిత (7799874416)ను,
స్పోర్ట్స్ & గేమ్స్ కోసం పీ.వాసుదేవ్ (9502516513), ఎస్.ప్రణతి రెడ్డి (7396596289)ను,
లిటరేచర్, క్రియేటివ్ ఆర్ట్స్, ఫ్యాషన్ విభాగాల కోసం ఈ.లీలాధర్ (9908911201), జీ.సాయి పూజిత (7032169578)ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.










