
అమరావతి:30-10-2025:-రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగం పనితీరులో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్ 2025) వ్యవధిలో వైద్య సేవల అమలు, సిబ్బంది హాజరు, పథకాల అమలు తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.మంత్రికి అందిన నివేదికల ప్రకారం, గడిచిన ఆరు నెలల్లో ప్రభుత్వ వైద్య సిబ్బంది హాజరు 83 శాతం నుంచి 92 శాతానికి పెరిగింది. నర్సులు, పారా మెడికల్ సిబ్బంది హాజరు 90 శాతానికి పైగా ఉండగా, వైద్యుల హాజరు 82 శాతం వద్ద నిలిచింది. డాక్టర్ల హాజరును మరింత పెంచాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
జిజిహెచ్ల హాజరు ర్యాంకులువిశాఖపట్నంలోని కెజిహెచ్ (93.13%), కర్నూలు జిజిహెచ్ (92.71%), రాజమహేంద్రవరం జిజిహెచ్ (91.46%) ముందువరుసలో నిలిచాయి. తక్కువ హాజరు నమోదు చేసిన ఆసుపత్రులలో నెల్లూరు (66.44%), ఏలూరు (76.30%), గుంటూరు (77.84%) జిజిహెచ్లు ఉన్నాయి.మెడికల్ కాలేజీలలో తిరుపతి శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజీ 100 శాతం హాజరుతో అగ్రస్థానంలో ఉండగా, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ (99.92%), విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీ (95.30%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఓపీ సేవల్లో వేగం
గతేడాదితో పోలిస్తే ఓపీ సేవలందించడంలో సమయం 42 నిమిషాల నుండి 26 నిమిషాలకు తగ్గిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 4 కోట్లకుపైగా ఓపీ సేవలు ఈ కాలంలో అందించబడ్డాయి.
ఓపీ, అభా రిజిస్ట్రేషన్ కౌంటర్ల సంఖ్య పెరగడం ఈ ఫలితాలకు కారణమని మంత్రి తెలిపారు — 2024లో 80 కౌంటర్లు ఉన్న చోటా, ఇప్పుడు అవి 150కు పెరిగాయి. డయాగ్నస్టిక్ సేవల్లో వృద్ధిఈ ఆరు నెలల్లో 2.5 కోట్లకు పైగా ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఇసిజీ, ల్యాబ్ టెస్టులు నిర్వహించబడ్డాయి. ఈ విభాగంలో 6.10 శాతం వృద్ధి నమోదైనట్లు నివేదిక పేర్కొంది. జిల్లాల ర్యాంకులునేషనల్ హెల్త్ మిషన్ పథకాల అమలులో తూర్పుగోదావరి, కడప, తిరుపతి జిల్లాలు ముందంజలో నిలవగా, ఎఎస్సార్, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడ్డాయి.డివిజన్ల పనితీరులో డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం, మాతా శిశు ఆరోగ్య విభాగం మంచి ఫలితాలు సాధించగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆర్బిఎస్కే విభాగాలు మెరుగుదల అవసరమని మంత్రి గమనించారు.
“మూల్యాంకన వ్యవస్థ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి”వైద్యరంగంలో బాధ్యత, పారదర్శకతను తీసుకురావడానికి ప్రవేశపెట్టిన కొత్త మూల్యాంకన వ్యవస్థ సత్ఫలితాలు ఇస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అయితే వ్యవస్థ పూర్తి ప్రక్షాళన కోసం ఇంకా కృషి అవసరమని తెలిపారు.
అసంక్రమిక వ్యాధుల చికిత్సలో లోపాలను సవరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.“మూల్యాంకన వ్యవస్థ ఫలితాల ఆధారంగా లోపాలను సరిదిద్దుకుంటూ, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే మా లక్ష్యం,”— మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్







