
బాపట్ల:-బాపట్ల పట్టణం ఇస్లాంపేట ప్రాంతంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ, జనవరి 1 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు ముందుగానే, డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపు గ్రామాలు, పట్టణాలు, వార్డులు, పంచాయతీల్లో ఇంటింటికి వెళ్లి అధికార యంత్రాంగంతో కలిసి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.bapatla news
ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు సాంబిరెడ్డి, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, వార్డు ప్రెసిడెంట్లు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










