
బాపట్ల :- మండలం స్టూవర్టుపురం గ్రామంలో శుక్రవారం ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని, పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, విధవలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.Bapatla Local News అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.







