శ్రీకాళహస్తి మండలం ఉరందూరు గ్రామ హరిజనవాడ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో పాల్గొని పలువురు లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్న జిల్లా ఇంఛార్జి మంత్రి మరియు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణ రెడ్డి. మంత్రుల వెంట ఎంఎల్ఏ బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తదితర సంబంధిత అధికారులు ఉన్నారు.
అడుగడుగునా మంత్రులకు, ఎంఎల్ఏ శ్రీకాళహస్తి కి నీరాజనం పడుతున్న ప్రజానీకం.
ఆప్యాయంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ లబ్ధిదారులను పలకరిస్తు పెన్షన్లను పంపిణీ చేస్తున్న మంత్రులు, ఎంఎల్ఏ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్న పలువురు పెన్షన్ లబ్ధిదారులు.