ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటికీ దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. – ప్రత్తిపాటి.
పల్నాడు జిల్లా చిలక
స్వర్గీయ ఎన్.టీ.ఆర్ వ్యక్తి కాదని, ఒక మహాశక్తి అని, నమ్మకం.. విశ్వాసమనే పునాదులపైనే ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిందని, ఆయనిచ్చిన స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా వడివడిగా పరుగులు పెట్టిస్తున్నారని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం నియోజకవర్గంలో యన్.ఆర్.టీ సెంటర్, 9వ వార్డు నెహ్రూ నగర్, కళామందీర్ సెంటర్, 34వ వార్డు సుగాలి కాలనీ, 7వ వార్డు ఎన్టీఆర్ కాలనీ మరియు పలుచోట్ల జరిగిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమలలో పాల్గొనీ ఎన్టీఆర్ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అన్నదాన కార్యక్రమాలు, బట్టలు పంపిణీ చేశారు. 32వ వార్డు భావనారుషినగర్ నందు నందమూరి తారకరామారావు గారి విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం మాజీమంత్రి పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తొలుత పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ. బీసీలకు రాజ్యాధికారం.. మహిళలకు ఆస్తిలో సమానహక్కు… పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు.. రూపాయికే కిలోబియ్యం.. జనతావస్త్రాల పంపిణీ.. పక్కాఇళ్ల నిర్మాణం… వంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఎన్టీఆర్, వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారన్నారు. ఆనాడు.. . స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా పరుగులు పెట్టిస్తున్నారన్నారు. తాతకు తగ్గ మనవడిగా మంత్రి లోకేశ్ తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులను కోటికి చేర్చారని, దేశంలో మరే రాజకీయపార్టీ సాధించని ఘనతను సాధించేలా చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్ లు, అభిమానులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.