ఆంధ్రప్రదేశ్గుంటూరు
NTR statue unveiling live broadcast by Koritipadu: Guntur :ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోరిటిపాడు ప్రత్యక్ష ప్రసారం
- గుంటూరు నగరం కొరిటెపాడు సెంటర్ లో ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఆవిష్కరించారు.
- తెలుగు వారి గుండెల పై చెరగని సంతకం
- వెండి తెరపై నట విశ్వరూపం
- తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దైవ స్వరూపం
- అన్న నందమూరి తారకరామారావు
- ఎన్టీఆర్ అంటే పేరు కాదు ఒక వైబ్రేషన్
- కాంగ్రెస్ కంచు కోటను కూల్చిన ఒక సెన్సేషన్
- రాయలసీమ నుంచి కోనసీమ వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఒక ఎమోషన్
- అన్నమన మధ్య లేకపోయినా కూడా ఆయన చూపించిన నిజాయితీ నేటికీ పార్టీలో కార్యకర్తల్లో తొనికిసలాడుతూనే ఉంది.
- ఈ కార్యక్రమాన్ని కొమ్మినేని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గతంలో ఇక్కడ విగ్రహం పెట్టాలనుకుంటే పెట్టనివ్వలేదు.
- ఆపగలరా బ్రదర్ ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం ఎవరూ ఆపలేరు.
- 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీని ఎండనకా వానకా.. పగలనకా రేయనకా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు కృషిచేసి నిలబెట్టారు.
- ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ,పవన్ కళ్యాణ్ pగాని నేను గాని, ఎమ్మెల్యేలు గాని గుంటూరు జిల్లా అభివృద్ధికి నిత్యం కష్టపడి సాధిస్తామని, మీ అందరూ మాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయబోమని మీ అందరి సాక్షిగా మరోసారి హామీ ఇస్తున్నాను.
- ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద రత్తయ్య, ఎమ్మెల్యేలు ధూళిపాల్ల నరేంద్ర కుమార్, గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, లిడ్ కాప్ చైర్మన్ పెళ్లి మాణిక్యాలరావు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్థానిక కార్పొరేటర్లు నూకవరపు బాలాజీ, పోతురాజు సమత, కన్నా లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ ఈరంటి హరిబాబు, టిడిపి నాయకులు కనపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.