
జగ్గయ్యపేట:పెనుగంచిప్రోలు :-భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నూరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం పెనుగంచిప్రోలు మండల కేంద్రంలోని కర్ల లింగయ్య కళాభవన్ సీపీఐ కార్యాలయం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభకు ముందు మండలంలోని ముచ్చింతాల, అనిగండ్లపాడు గ్రామాల నుంచి కమ్యూనిస్టు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చారు. పెనుగంచిప్రోలు, ముచ్చింతాల, అనిగండ్లపాడు గ్రామాల సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ పట్టణంలో ఉత్సాహంగా సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా సీపీఐ ప్రధాన కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ, నూరు వసంతాల ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని అన్నారు. విద్యార్థి, కార్మిక, రైతు, యువజన, మహిళా సంఘాలను ఏర్పాటు చేసి సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన పార్టీ సీపీఐ అని తెలిపారు.http://ntr vvijayawada news
అనేక భూపోరాటాలు చేసి, తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతు తెలుపుతూ వందల మందికి భూములు పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ఎలాంటి సహకారం అందించని బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు నేడు దేశాన్ని పాలిస్తున్నాయనే ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని పంచభూతాలను కూడా ఆదానీ, అంబానీ ల స్వంతమయ్యేలా పాలకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
పేద ప్రజల పక్షాన పోరాడుతున్న కమ్యూనిస్టులపై తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. విశాఖలో యువజన, కార్మిక సంఘాలపై పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశంలో మతోన్మాదం, హింస పెరుగుతున్న ఈ తరుణంలో యువత ముందుకు వచ్చి భారత కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్ని కుట్రలు చేసినా, సంఘవిద్రోహ శక్తులను ఎదుర్కొని పేదల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు బుడ్డి రాయప్ప, సీనియర్ నాయకులు వల్లంకొండ బ్రాహ్మం, మాజీ ఎంపీపీ పొన్నం నరసింహారావు, చల్లాల శివాజీ (సిద్ధాంతి), పద్మాల వెంకటేశ్వరరావు, నంబూరి చలపతిరావు, కనకపుడి బాబురావు, అంబోజి శివాజీ, మాశెట్టి రమేష్‌బాబు, షేక్ జానీ, అసదుల్లా, అనిగండ్లపాడు శర్మ, ఆర్టీసీ మీరా, భోగ్యం నాగులు, షేక్ కరీం, కరిసే మధు, పద్మాల మునసొబు, జక్కులూరి వెంకటేశ్వర్లు, నలగర్ల పెద్దలింగయ్య, వేల్పుల కాంతయ్య, ఇంటూరి ప్రవీణ్, కటారపు కన్నయ్య, గడ్డం శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, వల్లంకొండ భాస్కరరావు, ముళ్లపాటి వెంకటేశ్వర్లు, రామారావు, కనకపుడి మరియమ్మ, జక్కులూరి వెంకటరావమ్మతో పాటు మహిళా కార్యకర్తలు, కమ్యూనిస్టు శ్రేణులు పాల్గొన్నారు.
ముందుగా కర్ల లింగయ్య కళాభవన్‌పై రైతు సంఘం నాయకులు చుండూరు సుబ్బారావు ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయం ముందు అమరవీరుల స్థూపం వద్ద దోనేపూడి శంకర్ అరుణపతాకాన్ని ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు.










