
గుంటూరు: ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన SGF (School Games Federation) U-14 కబడ్డీ విభాగం పోటీలు నూతక్కి ZPHS పాఠశాలలో 18-11-2025న జరగగా, అందులో ప్రతిభ కనబరిచిన APRS (UB), గుంటూరు పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి Sk. Md. Nadeem రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణంగా మారింది. Guntur: ఏఎమ్ రత్నం వర్సెస్ కె.ఎల్.నారాయణ – అధిపత్యపు పోరులో ఆగిన ఎఫ్.డి.సి. చైర్మన్ నియామకం
ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి M. రాజని, వైస్ ప్రిన్సిపాల్ ప్రజ్వల్, PET R. శ్రీనివాస్ ఆయనను హృదయపూర్వకంగా అభినందించారు. క్రీడల పట్ల నదీం చూపుతున్న నిబద్ధత, క్రమశిక్షణ, ప్రతిభను వారు ప్రత్యేకంగా ప్రశంసించారు.
నదీం రాష్ట్ర స్థాయిలో కూడా మెరుగైన ప్రదర్శన చూపి పాఠశాల పేరు మరింత ఎత్తుకు తీసుకెళతాడనే నమ్మకంతో ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థి తల్లిదండ్రులు, సహవిద్యార్థులు కూడా అతనిపై గర్వాన్ని వ్యక్తం చేశారు.
క్రీడా రంగంలో విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు SGF పోటీలు గొప్ప వేదిక అని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.








