
గుంటూరులోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రముఖ సామాజిక సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక సమానత్వం కోసం వెంకటరెడ్డి చేసిన అలుపెరగని పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాలను అందిపుచ్చుకుని, సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితం గడపాలని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, సమాజ సేవనే పరమావధిగా జీవించిన వెంకటరెడ్డి జీవన ప్రస్థానం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, వివిధ సంఘాల ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది మరియు జిల్లా అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.http://GUNTUR LOCAL NEWS







