chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

ముక్కోటి ఏకాదశి సందర్భంగా…

వినుకొండలో జీవీ, మక్కెన ప్రత్యేక పూజలు..

పల్నాడు ప్రాంతం, రాష్ట్రం, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని, ప్రజలు సంతోషంగా ఉండాలనే తాను ఎప్పుడూ ఆ భగవంతుడుని కోరుకుంటానని అన్నారు ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ప్రజలందరూ బాగుండి మన సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలన్నదే తన ప్రార్థనగా ఉంటుందన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వినుకొండ శ్రీనివాస్‌నగర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామునే ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు జీవీ, మక్కెనకు స్వాగతం పలికారు. అర్చకులు వేదాశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీవీ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన, విశేషమైన రోజు అని, వేంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునే రోజు అని తెలిపారు. పర్వదినం రోజున స్వామిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే విశేషంగా ఆశీస్సులు ఇస్తారని భక్తుల నమ్మకమని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా వైష్ణవాలయాల్లో విశేషంగా పూజలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడికి భక్తులు భారీగా తరలివచ్చారని, వారందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వినుకొండ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి శక్తివంచన లేకుండా పాటుపడతానని తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker