
ఒంగోలు:26-11-25:- ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మెన్ మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్‌ను బాపట్ల నియోజకవర్గ జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా విన్నకోట సురేష్, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మరియు బాపట్ల తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి, బాపట్ల A.M.C డైరెక్టర్ గొట్టిపాటి శ్రీకృష్ణ, బాపట్ల రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు దాసరి ఏసుబాబు, బాపట్ల పట్టణ నాయకులు కారుమూరి అంజినెష్, పసుపులేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
నాయకులు పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు మరియు అభివృద్ధి అంశాలపై రియాజ్‌తో చర్చించినట్లు సమాచారం.







