ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో పట్టభద్రుల గళాన్ని బలంగా వినిపించే సత్తా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఉందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ఉమ్మడి కృష్ణ,గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి ఇస్తామని, 30 వేల కు పైగా ఓట్లు మన నియోజకవర్గంలో నమోదు అయ్యారని, మెజారిటీ కూడా అదే స్థాయిలో ఉండబోతున్నదని దీని కోసం నియోజకవర్గంలో ఉన్న ఎన్డీయే కూటమి నేతలు సిద్ధం అవ్వాలని గళ్ళ మాధవి పిలుపునిచ్చారు. ఈ ఎమ్మెల్సి ఎన్నికలను మనం ప్రతిష్టాత్మకంగా తీస్కోని ఒక ప్రణాళికతో ముందుకు వెళ్దామని, ప్రతి ఓటర్ ను వ్యక్తిగతంగా కలిసి,ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేద్దామని, ఆయనను అద్బుత మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆ దిశగా ప్రతి ఒక్కరు పనిచేసి పశ్చిమ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీ ని అందించాలని ఎమ్మెల్యే సూచించారు. అదేవిధంగా ఎమ్మెల్సి ఎన్నికల పరిశిలకులు పొడపాటి తేజస్వి మాట్లాడుతూతెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారనడానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడమే నిదర్శనమని, గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్ధిగా గళ్ళ మాధవిని ప్రకటించినప్పుడు ఏవిధంగా అయితే పనిచేసి 50 వేలకు పైగా మెజారిటి వచ్చేలాగా ప్రతి నాయకుడు, కార్యకర్త ఎలాగా అయితే పని చేశారో,ఇదే విధంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల దృష్టి పెడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పారు. సహచరులతో ఓటేయించడంతో పాటు వారి సాయంతో ఇతరులను కూడా ఓటేసేలా ప్రోత్సహించాలని చెప్పారు.
Read Next
8 minutes ago
జస్టిస్ బట్టు దేవానంద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ
16 hours ago
జీవి ఆంజనేయులు 60వ జయంతి ఘనంగా||G.V. Anjaneyulu 60th Birthday Celebrations
16 hours ago
విద్యాసంస్థల పరిధిలో తంబాకువస్తువుల విక్రయంపై AP పోలీసులు శిక్షాత్మక చర్య – 100 మీటర్లు గడిని గట్టింపు! | Strict Action in Andhra Pradesh: Selling Tobacco Within 100 Meters of Schools Now Crackdown Territory!
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
Check Also
Close