
చీరాల:డిసెంబర్ 24:-గుంటూరు జిల్లా హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండవ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ ఫెస్టివల్ “ఆదర్శ్–2025” లో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాల విద్యార్థులు సత్తా చాటి ఓవర్‌ఆల్ చాంపియన్‌షిప్ ను కైవసం చేసుకున్నారు.
ఈ విషయాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణా రావు మరియు కళాశాల కరస్పాండెంట్ యస్. లక్ష్మణరావు సంయుక్తంగా ఒక ప్రకటనలో వెల్లడించారు.Chirala Local News రాష్ట్ర స్థాయి పోటీల్లో చీరాల సెయింట్ ఆన్స్ కళాశాల జట్లు విజయ పతాకాన్ని ఎగురవేయడం గర్వకారణమని వారు పేర్కొన్నారు.
కళాశాల ప్రధాన అధ్యాపకులు డా|| కె. జగదీష్ బాబు మాట్లాడుతూ, మెన్స్ వాలీబాల్, ఉమెన్స్ వాలీబాల్, మెన్స్ మరియు ఉమెన్స్ బ్యాడ్మింటన్, క్యారమ్స్ (మెన్స్, ఉమెన్స్) విభాగాల్లో విజేతలుగా నిలవడంతో పాటు, ఉమెన్స్ షాట్‌పుట్‌లో మొదటి, రెండవ స్థానాలను సాధించడం ద్వారా ఓవర్‌ఆల్ చాంపియన్‌షిప్ దక్కిందని తెలిపారు.
కళాశాల వ్యాయామ అధ్యాపకులు అన్నం శ్రీనివాస రావు మాట్లాడుతూ, విజేత జట్లకు హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి యాజమాన్యం నగదు బహుమతులు అందజేశారని తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్.వి. రమణ మూర్తి, డైరెక్టర్ (అక్రిడిటేషన్స్) డా|| సి. సుబ్బారావు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని, మెన్స్ వాలీబాల్, ఉమెన్స్ వాలీబాల్, మెన్స్–ఉమెన్స్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, మెన్స్–ఉమెన్స్ షాట్‌పుట్ జట్లను ఘనంగా అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో సెయింట్ ఆన్స్ విద్యార్థుల విజయం కళాశాల క్రీడా ప్రతిభకు నిదర్శనమని పలువురు ప్రశంసించారు.










