
బాపట్ల :-పి–4 స్ఫూర్తితో జిల్లాలో ప్రారంభించిన బాపట్ల సేవాసేతు కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ అధికారి సిహెచ్. నరేష్ ఒక ఇన్సినిరేటర్ పరికరాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అందజేసిన ఇన్సినిరేటర్‌ను చీరాల ఏపీ మోడల్ స్కూల్‌కు అందించినట్లు తెలిపారు.

సమాజ సేవ చేయాలనే భావన కలిగిన వారికి బాపట్ల సేవాసేతు ఒక చక్కటి వేదికగా నిలుస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, దాతలు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి సహకారం అందించడం అభినందనీయమని అన్నారు.Bapatla Local News :రేపల్లె మండల రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్ పాల్గొన్నారు.










