
పెడన:నవంబర్ 13:-పెడన నియోజకవర్గం ఈదుముడి గ్రామంలో వరి ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్.రైతులతో మాట్లాడిన సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఇబ్బందులు లేకుండా సులభతరంగా, పారదర్శకంగా కొనుగోలు జరుగుతుందనేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రైతులకు అవసరమైన గోనె సంచులు సమయానికి అందజేయడం, కొనుగోలు చేసిన 24 గంటల్లోపే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం, అలాగే అకాల వర్షాల కారణంగా ధాన్యం దెబ్బతినకుండా టార్పులిన్ షీట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.







