
పశ్చిమగోదావరి : నర్సాపురం:31-10-25:- పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురండీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ శ్రీవేదకు అరుదైన గౌరవం దక్కింది. గుజరాత్‌లోని కేవాడియాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఎకతా దివస్’ పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ కన్టింజెంట్ కమాండర్‌గా ఆమె ఎంపికయ్యారు.భారతదేశ ఐక్యతకు ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ఈ పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం, డాక్టర్ శ్రీవేద సేవా నిబద్ధతకు, క్రమశిక్షణకు, నాయకత్వ నైపుణ్యాలకు లభించిన గౌరవంగా పేర్కొంటున్నారు.
ప్రస్తుతం డాక్టర్ శ్రీవేద కేవాడియాలో జరుగుతున్న రిహార్సల్స్‌లో పాల్గొంటున్నారు. దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచే ఎకతా దివస్ వేదికపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రతిష్ఠను ప్రతిబింబించే ఈ గుర్తింపు, రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు గర్వకారణంగా మారింది.







