

కృష్ణాజిల్లా:ధాన్యపు రాశులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
వేమవరం(గుడ్లవల్లేరు మండలం)
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వేమవరపాలెం గ్రామానికి సమీపంలో పెడన–గుడివాడ ప్రధాన రహదారిపై రైతులు ఆరబెట్టిన ధాన్యపు రాశులను పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రం మచిలీపట్నం నుండి గుడివాడ వైపు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఆగి రైతులు ఆరబెడుతున్న ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. గుడ్లవల్లేరు మండలం వేమవరపాలెం గ్రామానికి చెందిన అబ్దుల్ సలాం, ఎకరం 50 సెంట్ల పొలంలో పండించిన ఎంటియు 1318 రకం ధాన్యం పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిన్న మంగళవారం వరికోత యంత్రంతో కోత కోసి ధాన్యాన్ని ఆరబెట్టానని, అయితే ఇటీవలి తుపానుకు చేను ఈత ఈనిందని, ఆ సమయంలో వర్షాలకు తడవడం వల్ల మానుగాయ తెగులు వచ్చిందని రైతు కలెక్టర్కు వివరించారు.







