

ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నేపథ్యంలో మిల్లులో సిద్ధతను పరిశీలించేందుకు బాపట్ల ఆర్డీవో గ్లోరియా ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్లలోని వెంకట నాగసాయి ట్రేడర్స్ మిల్లును అధికారులు సందర్శించి స్టాక్ ఏర్పాట్లు, యార్డ్ సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ఆర్డీవో సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సలీమా, సివిల్ సప్లైస్ డీటీ ఫణి కుమార్, ఫైర్, ఎనర్జీ, లీగల్ మెట్రాలజీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.







