
వినుకొండ:-జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు సోమవారం మంగళగిరి సీకే కన్వెన్షన్ హాలులో భారీగా ‘పదవి – బాధ్యత’ సమావేశం నిర్వహించారు. సుమారు 3 వేల మందితో జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీలో నామినేటెడ్ పదవులు స్వీకరించిన నేతలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాణ్ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజాసేవలో పదవుల ప్రాధాన్యత, బాధ్యతాయుతమైన రాజకీయాలపై ఆయన కీలక సూచనలు చేయనున్నారని సమాచారంPalnadu district : A huge landslide occurred in Vinukonda, A fire accident occurred..
ఈ సమావేశానికి వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో వినుకొండ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు తరలివెళ్లారు. నీటి సంఘాల అధ్యక్షులు, సొసైటీ డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, దేవాలయ కమిటీ డైరెక్టర్లు సమావేశంలో పాల్గొని పార్టీ కార్యక్రమానికి మద్దతు తెలిపారు.
పార్టీ బలోపేతం దిశగా ఈ సమావేశం కీలక మైలురాయిగా నిలుస్తుందని జనసేన నేతలు అభిప్రాయపడ్డారు.







