
Chirala:20-11-25:-వేటపాలెం మరియు చీరాల మండలాల్లో నూతన గృహ నిర్మాణ దరఖాస్తుల సర్వే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పక్కా గృహం లేని కుటుంబాలెవరికైనా ఇది చివరి అవకాశం. ఈ నెల 30వ తేదీ లోపు తప్పనిసరిగా దరఖాస్తులు సమర్పించాలి. గడువు తర్వాత పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు — అందుకే ప్రతి అర్హుడు వెంటనే స్పందించాలి.గ్రామ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు గ్రామాల్లో నేరుగా సర్వే నిర్వహిస్తున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదు చేయించుకోవడంలో నిర్లక్ష్యం చేయకూడదు.ఈ సందర్భంగా ప్రజలకు అవసరమైన మార్గదర్శకాలు, సహాయం కోసం సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు:వేటపాలెం ఏఈ శ్రీనివాసరావు – 7093930877చీరాల మండల ఏఈ సుబ్బారావు – 7093930876







