
జిల్లాలో డ్వాక్రా, మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్ మాల్ పై పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సీరియస్ అయ్యారు. అవినీతిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నిధులు దారి మళ్లించిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, దుర్వినియోగమైన ప్రతి పైసా రికవరీ చేస్తామన్నారు. అక్రమాల వల్ల నష్టపోయిన మహిళా సంఘాలకు ప్రభుత్వం తరపున అండగా ఉండి, తిరిగి రుణాలు పొందేలా చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు.







