శ్రీకాకుళం, సెప్టెంబర్ 13:
శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) ఈ కళాశాలకు గుర్తింపు ప్రకటించింది.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. వెంకటలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరానికి గాను లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాంలో విద్యార్థులు చూపిన ప్రతిభ, వినూత్నతకు గుర్తింపుగా ఈ గౌరవం లభించిందని వివరించారు.
ఆమె మాట్లాడుతూ, ఈ గుర్తింపు కళాశాల విద్యార్థుల కృషికి, అధ్యాపకుల మార్గదర్శకత్వానికి ప్రతిఫలమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించేలా కళాశాల తరపున కృషి కొనసాగిస్తామని డాక్టర్ వెంకటలక్ష్మి స్పష్టం చేశారు.