
పల్నాడు, జనవరి 31, 2026:-శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేర నియంత్రణ లక్ష్యంగా పల్నాడు జిల్లా పోలీసులు విస్తృతంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ బి. కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధి చెరుకుంపాలెం గ్రామంలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

సత్తెనపల్లి డీఎస్పీ శ్రీ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. గ్రామంలో ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మన్నే సుల్తాన్ పాలెం గ్రామంలో సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్‌తో పాటు గడ్డపారలు–5, కొడవళ్ళు–3, రాడ్లు–9, వైరు చుట్టలు–1ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అదనంగా రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, శాంతి భద్రతలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని డీఎస్పీ గ్రామస్తులకు సూచిస్తూ ప్రతిజ్ఞ చేయించారు.

గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని, ఏ చిన్న సమస్య ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని అధికారులు తెలిపారు. పాత కేసుల నిందితులు పాత పంథా విడిచి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ ఎం. హనుమంతరావుతో పాటు అచ్చంపేట సీఐ పి. శ్రీనివాసరావు, పెదకూరపాడు సర్కిల్ సీఐ పి. సురేష్, సత్తెనపల్లి రూరల్ సర్కిల్ సీఐ పి. కిరణ్, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.PALANADU NEWS: మహిళల సొమ్ము దారి మళ్లిస్తే జైలుకే : పల్నాడు జిల్లా కలెక్టర్ హెచ్చరిక










