Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍 పల్నాడు జిల్లాఆంధ్రప్రదేశ్

PALNADU NEWS : తూబాడులో సీసీరోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనుల పరిశీలన

తాగునీటి సరఫరా, చెరువులు..లిఫ్ట్ ల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించను : మాజీమంత్రి ప్రత్తిపాటి లింగంగుంట్ల తాగునీటి చెరువును, కుప్పగంజివాగు లిఫ్ట్ ను పరిశీలించిన ప్రత్తిపాటి. తూబాడులో సీసీరోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనుల పరిశీలన నియోజకవర్గంలోని తాగునీటి చెరువుల నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, చెరువుల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేసి, గట్లపై మంచి మొక్కలు పెంచాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలోని మంచినీటిచెరువును, కుప్పగంజి వాగుపై ఉన్న ఎత్తిపోతలపథకాన్ని (లిఫ్ట్) మాజీమంత్రి బుధవారం గ్రామస్తులతో కలిసి పరిశీలించారు.3 గ్రామాలకు తాగునీరు అందించే చెరువును జాగ్రత్తగా నిర్వహించండి. చెరువులోని పూడిక తొలగించి చుట్టూ మొక్కలు పెంచండి.చెరువులోని పూడికను వేసవిలోనే తొలగించాలని, ఎలాంటి నాచు, తూటికాడసహా, ఇతర వ్యర్థాలు లేకుండా చూడాలని, చెరువు గట్టుపై మంచి మొక్కలు పెంచాలని పుల్లారావు ఆర్.డబ్ల్యూఎస్ మరియు పంచాయతీ అధికారుల్ని ఆదేశించారు. గ్రామస్తులు కూడా చెరువును రక్షణలో ప్రభుత్వ సిబ్బందికి సహకరించాలన్నారు. చెరువుకు నీటి సరఫరాకోసం కుప్పగంజి వాగుపై రూ.25లక్షలతో ఇటీవలే మరమ్మతులు చేసిన లిఫ్ట్ ను పరిశీలించిన మాజీమంత్రి, అధికారులకు పలుసూచనలు చేశారు. లిఫ్ట్ ను జాగ్రత్తగా వినియోగించాలని, పైపులైన్ల నుంచి నీరు వృథా అవ్వకుండా చూడాలని, లీకేజ్ లను తక్షణమే సరిచేయాలని చెప్పారు. ఇటీవలే లిఫ్ట్ కు మరమ్మతుల చేసినందున మోటార్లను జాగ్రత్తగా వినియోగించాలని చెప్పారు. లిఫ్ట్ పాడైతే తాగునీటికి ఇబ్బంది అవుతుందని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా పనిచేయాలన్నారు. వేసవిలో ఒక్కరోజు నీటిసరపరా నిలిచిపోయినా అనేక సమస్యలు తలెత్తుతాయనే విషయాన్ని అధికారయంత్రాంగం విస్మరించకూడదన్నారు. లిఫ్ట్ ద్వారా లింగంగుంట్ల,కావూరు, పురుషోత్తమపట్నం గ్రామాలకు తాగునీరు, 2586 ఎకరాలకు సాగునీరు అందుతుందనే నిజాన్ని గుర్తించి పనిచేయాలని మాజీమంత్రి సూచించారు. సొంతనిధులతో లిఫ్ట్ మరమ్మతు పనులు చేయించిన నీటిసంఘం అధ్యక్షులు భైరా సంజీవరావును ఆయనకు సహకరించిన లింగంగుంట్ల గ్రామ టీడీపీ నాయకులు తూబాటి కిశోర్, పెడవలి చంద్రశేఖర్, గ్రామ రైతుల్ని ప్రత్తిపాటి పేరుపేరునా అభినందించారు. సమస్యను గుర్తించి లిఫ్ట్ ను పునరుద్ధరణలో గ్రామస్తులంతా ఒకే మాటపై ఉండి పనిచేయడం నిజంగా మెచ్చుకోవాల్సిన అంశమన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button