
గుంటూరు:-దళిత జాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు సేవలందిస్తూ, గత కొన్ని దశాబ్దాలుగా దళిత క్షేమానికి అంకితభావంతో పనిచేస్తున్న కర్లపాలెం మండలం అంబేద్కర్ సేవా సమాజం గౌరవ అధ్యక్షుడు మందపాటి పరమానంద కుమార్‌కు ప్రతిష్ఠాత్మక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశిష్ట సేవా పురస్కారం లభించింది.
ఆదివారం గుంటూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దళిత రాష్ట్ర నాయకుడు మల్లెల వెంకటరావు, గోళ్ళ అరుణకుమార్ చేతుల మీదుగా పరమానంద కుమార్‌కు ఈ పురస్కారాన్ని ఘనంగా ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకటరావు మాట్లాడుతూ, డెల్టా ప్రాంతంలో దళితుల అభ్యున్నతే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తూ వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న పరమానంద కుమార్‌ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశిష్ట సేవా పురస్కారానికి ఎంపిక చేయడం ఎంతో ఆనందకరమన్నారు. Guntur Local newsభవిష్యత్తులో కూడా దళిత జాతి సంక్షేమం కోసం ఆయన మరింతగా సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన దళిత నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పురస్కారం అందుకున్న సందర్భంగా పరమానంద కుమార్‌ను కర్లపాలెం మండలానికి చెందిన పలువురు నాయకులు ఘనంగా అభినందించారు.







