chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Parchuru Local News :పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు

పర్చూరు :- పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (సాంబన్న) గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి సహకారంతో నోవా అగ్రి గ్రూప్, గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

Parchuru Local News :పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు

ఉదయం నుంచే కంటి వైద్య శిబిరానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. పేదలు, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. అర్హులైన వారికి ఉచిత చికిత్స, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Parchuru Local News :పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు

జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా గ్రామ గ్రామాన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, రైతుల సంక్షేమం, యువతకు ప్రోత్సాహమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Parchuru Local News :పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు

ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు హాజరై ఎమ్మెల్యే సాంబన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్చూరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నిలుస్తున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.Parchuru Local News :పంటల నమోదు పకడ్బందీగా జరగాలి – ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker