
పర్చూరు, సెప్టెంబరు 25:పర్చూరు నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషితో మొత్తం రూ.2.57 కోట్ల నిధులను మంజూరు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీసీ రోడ్లు, కల్వర్టులు, డ్రెయినేజీ వ్యవస్థల నిర్మాణానికి ఈ నిధులు కేటాయించబడ్డాయి.
ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల కింద ఈ పనులకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో డీపీసీ & కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా, ప్రజల నిత్య జీవన విధానాన్ని సులభతరం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.Parchur:కంచర్ల రామయ్య మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సంతాపం
తాజాగా జిల్లాకు వచ్చిన కలెక్టర్ వినోద్ కుమార్‌ను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కలిసి పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, వెంటనే స్పందించిన కలెక్టర్ తక్షణమే రూ.2.57 కోట్లకు ఆమోదముద్ర వేసి ఉత్తర్వులు జారీ చేశారు.

పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
- పోపూరి శ్రీనివాసరావు హౌస్ నుండి నాగరాజుపల్లి రోడ్డు మార్గం (మార్టూరు): సీసీ రోడ్డు & డ్రెయిన్ – రూ.21 లక్షలు
- న్యూ ఎస్‌టి కాలనీ (అడుసుమల్లి): సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణం – రూ.50 లక్షలు
- ప్రధాన రహదారి (అడుసుమల్లి): సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు – రూ.50 లక్షలు
- మార్టూరు టీచర్స్ కాలనీ: పెట్రోల్ బంక్ నుండి స్వాతి హౌస్ వరకు సీసీ రోడ్డుతో డ్రెయిన్ – రూ.12 లక్షలు
- చిమ్మిరిబండ (ఎస్‌సి కాలనీ): సీసీ రోడ్డు – రూ.15 లక్షలు
- మార్టూరు గ్రామం: సీసీ రోడ్డు – రూ.10 లక్షలు
- ఇంకోలు మండలం:
- గొల్లపాలెం సీసీ రోడ్డు – రూ.6 లక్షలు
- నక్కలపాలెం గ్రామం సీసీ రోడ్డు – రూ.6 లక్షలు
- చిన్నగంజాం మండలం:
- కడవకుదురు (ఎస్‌సి కాలనీ) సీసీ రోడ్డు – రూ.10 లక్షలు
- పెద్దగంజం (పాత గొల్లపాలెం) సీసీ రోడ్డు & డ్రెయిన్లు – రూ.20 లక్షలు
- హనుమోజిపాలెం గ్రామం సీసీ రోడ్డు – రూ.7 లక్షలు
ఈ నిధుల విడుదలతో పలు గ్రామాల్లో రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, జీవన ప్రమాణాల్లో మార్పు ఈ అభివృద్ధి పనుల ఫలితంగా కనిపించనుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు.










