

పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమైంది… శ్రీరామ్ తాతయ్య
తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి నడిచినప్పుడే విద్యారంగం బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. శుక్రవారం జగ్గయ్యపేట పట్టణంలోని, మిట్టగూడెం లో జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన మెగా పేరెంట్ – టీచర్స్ సమావేశం (పిటిఎం) 3.0 లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముందుగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలు హేమాంజలి (యోగాంజలి) చేసిన యోగ, హేమశ్రీ చేసిన కర్ర సాము ను తిలకించి అనంతరం వారిని సత్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి నడిచినప్పుడే విద్యా రంగం బలోపేతం అవుతుందని, పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమైందని, ఇంటి నుండి లభించే ప్రోత్సాహమే విద్యార్థులకు నిజమైన బలం అవుతుంది” అని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విద్యా రంగాన్ని పూర్తిగా మారుస్తామనే సంకల్పంతో పనిచేస్తున్నారని, కూటమి ప్రభుత్వం విద్యపై చేసిన ప్రాధాన్యత వల్లే పాఠశాలలలో నాణ్యమైన బోధన వాతావరణం సృష్టించడానికి అనేక కార్యక్రమాలు అమలు అవుతున్నాయి.” అని అన్నారు
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ‘నాణ్యతా విద్య – డిజిటల్ లెర్నింగ్ – పాఠశాల అభివృద్ధి’ అనే మూడు ప్రధాన లక్ష్యాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను ఆధునీకరించడం, బోధన నాణ్యతను పెంపొందించడం, విద్యార్థుల భవిష్యత్తును పోటీ ప్రపంచానికి సన్నద్ధం చేయడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయం.” అని తెలిపారు.
పిటిఎం 3.0 వంటి సమావేశాలు విద్యార్థుల అభ్యాస స్థాయిని సమీక్షించడానికి,తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య సమన్వయం పెంచడానికి ఎంతో ఉపయోగకరమని చెప్పారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్థానిక స్థాయిలో కూడా తాను నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు.
విద్యార్థులు పెద్ద లక్ష్యాలను పెట్టుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలి. ఉపాధ్యాయుల నిబద్ధత, కృషి అభినందనీయం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, 22వ వార్డు కౌన్సిలర్ గొట్టే నాగరాజు,15 వ వార్డు కౌన్సిలర్ ఇర్రి నరసింహారావు,హెచ్ ఎమ్ హేమ మాధవి,విద్యా కమిటీ చైర్మన్ శ్రీలక్ష్మి, విద్య కమిటీ వైస్ చైర్మన్ సర్వేపల్లి శ్రీనివాస్, ప్రకాష్, తాండవ కృష్ణ మరియు స్కూలు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.










