chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

JANGAREDDYGUDEM NEWS:పారిజాత గిరిపై స్వామివారిని దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

వేకువజామునే గోకుల తిరుమల గిరి ప్రదక్షిణ చేసిన శాసనసభ్యులు

  • భక్తులతో పోటెత్తిన ఏడుకొండల క్షేత్రం.. లక్షకు పైగా ఆదాయం

జంగారెడ్డిగూడెం:
స్థానిక ఏడుకొండలపై వెలసిన గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో వేకువజామున 4:30 గంటలకే సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, బాల భోగ నివేదన వంటి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు.

JANGAREDDYGUDEM NEWS:పారిజాత గిరిపై స్వామివారిని దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

గిరి ప్రదక్షిణ చేసిన ఎమ్మెల్యే:
పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు శనివారం ఉదయం పారిజాత గిరి ప్రదక్షిణ చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు ఘనస్వాగతం లభించింది. అనంతరం అర్చకులు ఆయనకు అష్టోత్తర పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు మరియు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈవో కలగల శ్రీనివాస్ మరియు సభ్యులు పాల్గొన్నారు.

పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల మొక్కులు:
పరీక్షల సమయం కావడంతో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ హాల్ టికెట్లను స్వామివారి పాదాల చెంత ఉంచి, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

JANGAREDDYGUDEM NEWS:పారిజాత గిరిపై స్వామివారిని దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

అన్నదాన వితరణ:
వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో మరియు ధర్మకర్తల మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన కోటపోతుల బాబి – వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, మరియు ఉండవల్లి రాధాకృష్ణ అన్నదాతలుగా వ్యవహరించి భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. వీరిని ఆలయ అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు శేష వస్త్రాలతో సన్మానించారు.

ఆలయ ఆదాయం:
ఈ ఒక్క రోజే పూజా టికెట్లు, విరాళాలు, ప్రసాదాలు మరియు అన్నదాన విరాళాల ద్వారా మొత్తం రూ. 1,00,800 (అక్షరాలా లక్షా ఎనిమిది వందల రూపాయలు) ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కలగల శ్రీనివాస్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు అన్నప్రగడ వీర రాఘవరావు, కన్నా కృష్ణ, కొప్పుల నాగ సురేంద్ర, ఆరేపల్లి నాని, దండు భవాని తదితరులు పాల్గొన్నారు.http://ELURU NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker