
న్యూఢిల్లీ: నవంబర్ 12:-కేంద్ర హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో లోక్‌సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన ‘మోంథా’ తుఫాను కారణంగా రాష్ట్రం ఎదుర్కొన్న తీవ్ర నష్టాన్ని ఆయన కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు.తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రహదారులు ధ్వంసమయ్యాయని, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఎంపీ వివరించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కమిటీ ముందు ఉంచారు.
రాష్ట్రం తుఫాను ప్రభావం నుంచి త్వరగా కోలుకోవడానికి రూ. 5,265 కోట్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని కేంద్రం నుంచి విడుదల చేయాలని తెన్నేటి కృష్ణ ప్రసాద్ కోరారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.”ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో మోంథా తుఫాను విపరీత నష్టం చేసింది. ప్రజల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం గమనించి, తక్షణ నిధులు మంజూరు చేయాలి,” అని ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ కమిటీ ముందు విజ్ఞప్తి చేశారు.







