

కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం మల్లవోలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్
రైతులు పండించే పంటకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం- పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఆర్థిక భరోసాని ఇస్తుందని అన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రైతులు మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… సాగు భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి, భూమి సాగు చేసుకునే కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, పిఎం కిసాన్ పథకం ద్వారా రూ. 6 వేలు ఆర్థిక సహాయం రైతులకు అందజేస్తున్నామని అన్నారు. అన్నదాత సుఖీభవ- పిఎం కిసాన్ ద్వారా పెడన నియోజకవర్గంలో 24,202 మంది రైతులకు గానూ 16 కోట్ల 3 లక్షలు నిధులు జమ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడు విడతలలో రైతులకు రూ. 20 వేలు అందజేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అన్నదాత కుటుంబాల్లో ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. సంక్షేమం అభివృద్ధి పనులు చేపడుతూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు








