
పెడన, నవంబర్ 1:_పెడన జయలక్ష్మి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం కొత్త పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని, యర్రపోతు నాగేశ్వరరావును అధ్యక్షుడిగా, బూసం డొలంబ మరియు కూనపరెడ్డి రంగయ్య నాయుడును సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, “రైతులను ఇబ్బంది పెట్టే అధికారులను అసలు సహించము,” అని స్పష్టం చేశారు. కూటమి నాయకుల సహకారంతోనే నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూటమి నాయకులను ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ, జయలక్ష్మి ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం రైతుల సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. పాలకవర్గ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన యర్రపోతు నాగేశ్వరరావు సంఘాన్ని అన్ని విధాలా అభివృద్ధి దిశగా నడిపించాలని కోరారు.
రైతుల ఆకాంక్షల మేరకే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు కొరియర్ శ్రీను, పట్టణ టీడీపీ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, అబ్దుల్ ఖయ్యాం (హన్ను), చందన నారాయణరావు, కౌన్సిలర్ మట్టా శివపావని, టీడీపీ నాయకుడు కమ్మగంటి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.







