
జగ్గయ్యపేట, అక్టోబర్ 31:-రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే కుట్రలో చంద్రబాబు నాయుడు నిమగ్నమై ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రవిచంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు.శుక్రవారం జగ్గయ్యపేట పట్టణంలోని ఒక ప్రముఖ కళాశాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడిన ఏ. రవిచంద్ర మాట్లాడుతూ,”పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను చేరువ చేయాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మొహన్ రెడ్డి దృఢ సంకల్పంతో వైద్య కళాశాలలను స్థాపించారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ కళాశాలలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలనే ఉద్దేశంతో పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చారు” అని ఆరోపించారు.ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా కోటి సంతకాలను సేకరించి గవర్నర్‌కు అందజేసి ఈ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైయస్ జగన్ గారు కృషి చేస్తున్నారని ఆయన వివరించారు.“తన హయాంలో చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీని కూడా స్థాపించలేకపోయారు. కానీ వైయస్ జగన్ కేవలం ఐదేళ్లలో—అందులో రెండేళ్లు కోవిడ్ కాలంలో గడిచినా—మూడేళ్లలోనే 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. వాటిలో ఐదు పూర్తయ్యాయి, మిగిలినవి నిర్మాణ దశల్లో ఉన్నాయి” అని రవిచంద్ర తెలిపారు
కోటి సంతకాల ఉద్యమానికి అపూర్వ స్పందన
కోటి సంతకాల సేకరణకు రాష్ట్రవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తున్నదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు.“ఒక్కో సంతకం పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందనే నమ్మకంతో ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు” అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఎంఎంపీ సంఘం అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, రాష్ట్ర చేనేత విభాగ ప్రతినిధి పెంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.







