Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News:పెదనందిపాడు మండలంలో కేంద్ర సహాయ మంత్రి పర్యటన

గుంటూరు జిల్లా: పెదనందిపాడు:12-10-25:- మండలం అబ్బినేనిగుంటపాలెంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రామాంజనేయులు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న జిల్లా పరిషత్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు. అజ్ఞానాన్ని అక్షరంతో నింపేది గురువు. మన సమాజంలో విద్యకు ఉన్న ప్రాధాన్యత ఎంతో గొప్పది,” అని అన్నారు. అబ్బినేనిగుంటపాలెంలోని పాత పాఠశాల గురించి గుర్తుచేస్తూ, “ఇక్కడ 75 ఏళ్ల క్రితం దాతల సహకారంతో పాఠశాల నిర్మించారు. ఈ పాఠశాల విద్యార్థుల్లో సుమారు 500 మంది ప్రస్తుతం ఎన్నారైలు గా విదేశాల్లో ఉన్నారు. మాజీ మంత్రి మాకినేని పెద రత్తయ్య, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, ఎన్నారై యుగంధర్ ప్రసాద్ లాంటి ప్రముఖులు ఇక్కడ చదువుకున్నారు,” అని వివరించారు.సొంత ఊరిపై ప్రేమతో ఎన్నారై యుగంధర్ ప్రసాద్ రూ.2 కోట్లు పాఠశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. “తల్లిదండ్రులను మరచిపోతున్న ఈ కాలంలో, సముద్రాలు దాటి అమెరికాలో ఉన్న యుగంధర్ తన గ్రామాన్ని మరచిపోలేదు. ఇది ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం,” అన్నారు.ముందుగా 2016లో రూ.40 లక్షలతో సాగర్ కాల్వ నుంచి పైపులైను వేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అలాగే, గ్రామంలో కోటి రూపాయలతో కల్యాణ మండపం నిర్మించారని, అనేకమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నారన్న విషయాన్ని హైలైట్ చేశారు.రాష్ట్రంలో రూ.60 వేల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అమలు స్తున్నామని,విద్యారంగంలో చరిత్రలో లేని విధంగా మార్పులు తీసుకొస్తున్నామని పెమ్మసాని పేర్కొన్నారుగతంలో పెద్ద విశ్వవిద్యాలయాల్లో.రాజకీయ నాయకుల తోత్తుల్ని చాన్సలర్లుగా నియమించేవారని, ఇప్పుడు మంత్రి లోకేష్ మంచి వ్యక్తులను వైస్ చాన్సలర్లుగా నియమిస్తున్నారని వ్యాఖ్యానించారు. డీఎస్సీ ద్వారా 16 వేల మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చినట్టు తెలిపారు. త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నదని వెల్లడించారు.పెదనందిపాడు వరకు గుంటూరు ఛానల్ నిర్వహణ బాధ్యత తమదేనని, అక్కడి నుంచి బాపట్ల జిల్లా అధికారులు చూసుకుంటారని మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ కొర్రపాటి నాగేశ్వరరావు, పెద్ది సాంబశివరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు మాకినేని శ్రీకాంత్, సొసైటీ చైర్మన్ పార్వతి కృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కోడూరు రాంబాబు, గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు జంపని హనుమంతరావు, ఎన్నారై లాస్ ఏంజిల్స్ టీడీపీ అధ్యక్షులు ఆళ్ల వెంకట్, బోలినేని బాలరత్నం, ఎన్పీ ప్రకాశ్, ఐటీడీపీ నాగరాజు, రామినేని శ్రీనివాసరావు, చంద్రయ్య, నాగండ్ల శ్రీనివాసరావు, విశ్వనాథం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button