chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

Eluru local news :పెదపాడు వ్యాపార సంస్థల భద్రతకు సీసీ కెమెరాలు అత్యవసరం-ఎస్సై ఆర్. శ్రీనివాస్

పెదపాడు:– నేర నియంత్రణతో పాటు వ్యాపార సంస్థల భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో సీసీ కెమెరాల ఏర్పాటు అత్యవసరమని పెదపాడు ఎస్సై ఆర్. శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా నేర నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నూజివీడు డీఎస్పీ శ్రీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనలతో, పెదవేగి ఇన్‌స్పెక్టర్ శ్రీ సిహెచ్. రాజశేఖర్ ఆధ్వర్యంలో పెదపాడు ఎస్సై శ్రీ ఆర్. శ్రీనివాస్ స్థానిక వర్తక సంఘం యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, దుకాణాలు, వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. సీసీ కెమెరాలు కేవలం నిఘా కోసమే కాకుండా, ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకునే విషయంలో పోలీసులకు “మూడవ కన్ను”గా ఉపయోగపడతాయని వివరించారు.

వ్యాపారస్తులు తమ షాపుల లోపలతో పాటు బయట రహదారి స్పష్టంగా కనిపించేలా నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, రికార్డింగ్ నిరంతరం కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాపారస్తులు భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ELURU JILLA VAARATHALU

ప్రతి ఒక్కరూ బాధ్యతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పెదపాడు గ్రామ వర్తక సంఘం అధ్యక్షులు, సంఘ సభ్యులు, స్థానిక వ్యాపారస్తులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker