Life Style

పాన్ ఆధార్ లింక్ చేయకపోతే భారీ జరిమానాలు!Penalty Alert: PAN Not Linked to Aadhaar?

కేంద్ర ప్రభుత్వం పాన్ (PAN) కార్డును ఆధార్ (Aadhaar) కార్డుతో తప్పనిసరిగా లింక్ చేయాలని స్పష్టమైన గడువు పెట్టింది. ఇది ఇప్పుడు కేవలం ఒక ఫార్మాలిటీ కాదు – ఒక ప్రాముఖ్యమైన ఆర్థిక బాధ్యతగా మారింది. మీ పాన్ ఆధార్‌తో లింక్ చేయకుండా దాన్ని ఉపయోగిస్తే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 272B ప్రకారం ఒక్కో ట్రాన్సాక్షన్‌కు ₹10,000 వరకు జరిమానా విధించే ప్రమాదం ఉంది. చాలా మంది ఈ విషయాన్ని లైట్ తీసుకుని తర్వాత పెద్ద భాదలు ఎదుర్కొంటున్నారు.

లింక్ చేయకపోతే పాన్ ‘ఇన్‌ఆపరేటివ్’ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయాలన్నా, ప్రాపర్టీ కొనాలన్నా, ఐటీఆర్ ఫైల్ చేయాలన్నా – పాన్ తప్పనిసరి. కానీ ఇన్‌ఆపరేటివ్ పాన్ వాడితే ప్రతి లావాదేవీకి జరిమానా పడుతుంది. ఈ మార్గదర్శకాలు లైట్ తీసుకుంటే మీ అకౌంట్‌ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. మల్టిపుల్ పాన్ కార్డులు కలిగి ఉండటం కూడా నేరమే. పేరులో మార్పుల కోసం కొత్త పాన్ తీసుకోవడం కాకుండా పాతదానిని అప్‌డేట్ చేయాలి.

ఇక పాన్ దుర్వినియోగం చేయడం, ఫేక్ పాన్‌లతో మోసాలు చేయడం ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ కళ్ల ముందే జరుగుతున్న వృత్తిగా మారింది. ఈ రకమైన మోసాలను గుర్తించేందుకు అధికారులు ఎడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇన్‌వాలిడ్ పాన్‌తో దాఖలు చేసిన రిటర్న్స్, హై వ్యాల్యూ లావాదేవీలపై నిఘా పెరిగింది.

తప్పుగా లింక్ చేయకపోతే మొదట సమాచారం ఇచ్చి జాగ్రత్త చెబుతారు. కానీ ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే ఐటీ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. బ్యాంక్ అకౌంట్లు, డీమ్యాట్ ఖాతాలు ఫ్రీజ్ అవుతాయి. ఐటీఆర్ రిజెక్ట్ అవుతుంది. అందుకే ఎటువంటి సమస్యలూ ఎదుర్కొనకూడదనుకుంటే వెంటనే పాన్-ఆధార్ లింక్ చేసుకోండి.

Authors

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker