
ఎన్టీఆర్:జగ్గయ్యపేట:12-12-25:-పెనుగంచిప్రోలు మండలంలోని రోడ్ల పరిస్థితి రోజు రోజుకీ అధ్వానంగా మారిపోతున్న నేపథ్యంలో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుమ్మడిదుర్రు–అనిగండ్లపాడు–పెట్రోల్ బంక్ మార్గం, పెనుగంచిప్రోలు–వేమవరం రహదారి, అలాగే ముచింతల రోడ్డు, ముళ్లపాడు రహదారులు గత సంవత్సరం వరదల తరువాత పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఇప్పటికీ మరమ్మత్తులను చూడక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.గత ఏడాది వచ్చిన భారీ వరదలతో రహదారులలో పెద్ద ఎత్తున గోతులు ఏర్పడటంతో అధికారులు తాత్కాలికంగా మట్టి రోడ్లు వేసి వాహనాలు నడిచేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ దారుల్లో నిత్యం ట్రాఫిక్ అధికంగా ఉండటంతో మట్టి రోడ్లు కూడా కొద్ది రోజుల్లోనే మళ్లీ పాడైపోయాయి. కొద్ది చోట్ల అడుగు లోతు గుంటలు ఏర్పడి రెండు చక్రాలే కాదు నాలుగు చక్రాల వాహనాలు కూడా ప్రయాణించడం ప్రమాదకరమైందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది వచ్చిన కొత్త వరదలతో పరిస్థితి మరింత చేదరుగిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“ఇంతకాలంగా రోడ్లు పాడైపోయినా ఎందుకు మరమ్మత్తు పనులు చేపట్టడం లేదు? మా ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.ఇటీవలి నెలల్లో నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, మరమ్మత్తుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, ఆ నిధులతో రెండు రోడ్ల పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతా అత్యవసర మార్గాలపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు బలంగా కోరుతున్నారు
NTR JILLA.ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉండి ప్రాణాంతకంగా మారిన ముళ్లపాడు రోడ్డు, ముచింతల–గుమ్మడిదూర్రు–అనిగండ్లపాడు మార్గం, అలాగే పాత వేమవరం రహదారులను అత్యవసరంగా పునరుద్ధరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని, అధికారులను వినతిచేస్తున్నారు.“ప్రజల ఇబ్బందులను గుర్తించి వెంటనే మరమ్మత్తు పనులు ప్రారంభించాలని అధికారులు చర్యలు తీసుకోవాలి” అని స్థానికుల డిమాండ్.







