Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

pettubadula veyam పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు రైతులకు అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా

గుంటూరు, అక్టోబర్ 16:-రైతులు వ్యవసాయ, ఉద్యాన మరియు పాడి పరిశ్రమ రంగాల్లో పెట్టుబడి వ్యయం తగ్గించుకొని, అధిక దిగుబడుల ద్వారా ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయ‌న ఈ సూచనలు చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మైక్రో ఇరిగేషన్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సాగు సాగుతున్న పంటల వివరాలు, వాటి దిగుబడులు, రైతులకు అందుతున్న సబ్సిడీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

విభాగాల వారీగా వివరాలివీ:

  • వ్యవసాయ & ఉద్యాన శాఖ: వివిధ పంటల సాగు, పెట్టుబడి వ్యయం, దిగుబడి లాభాలపై విశ్లేషణ.
  • పశు సంవర్ధక శాఖ: పశుగ్రాసం సరఫరా, వైద్య సేవలు, పాడి పరిశ్రమ ద్వారా రైతులకు లాభాలపై సమాచారం.
  • ఏపీఏంఐపి: మైక్రో ఇరిగేషన్ పథకాల కింద రైతులకు అందించిన డ్రిప్, స్ప్రింక్లర్ యూనిట్ల వివరాలు.
  • కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, ఖరీఫ్ 2025-26 సీజన్‌కు ముందుగా స్పష్టమైన కార్యాచరణతో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు. రైతులకు ప్రాతినిధ్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడానికిప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ సమీక్షలో జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు, ఉద్యానశాఖ అధికారి రవీంద్రబాబు, పశు సంవర్ధక శాఖ జేడీఏ సత్యనారాయణ, ఏపీఏంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ వజ్రశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button