పిజిఆర్ఎస్ సమస్యలను మండల స్థాయిలో అధికారులు పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు.
పి జి ఆర్ఎస్ కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు అర్జీల ద్వారా తమ సమస్యలను జిల్లా సంయుక్త కలెక్టర్ కు వినతి పత్రాల ద్వారా విన్నవించారు. 151 అర్జీలు పిజిఆర్ఎస్ లో నమోదు అయ్యాయి. మాకు న్యాయం చేయండి అంటూ అర్జీదారులు అధికారులను కోరారు. తన పరిధిలోని వాటికి అక్కడికక్కడే ఆమె పరిష్కార మార్గం చూపారు. కొన్నిటిని పరిశీలన, మరికొన్నింటిని విచారించాలని తక్షణమే సంబంధిత అధికారులకు పురమాయించారు. ప్రజల సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని ఆయన సూచించారు. గ్రామ, మండల స్థాయిలో ప్రజల నుంచి ఆర్జీల స్వీకరణ జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం ఇదే క్రమాన్ని పాటించాలని సూచించారు. నమోదైన అర్జీలను పరిశీలించిన, తదుపరి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. గత వారంలో మండల, డివిజన్, జిల్లా స్థాయిలో నిర్వహించిన పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 566 అర్జీలు నమోదు అయ్యాయన్నారు. ప్రజాప్రతినిధుల వద్దను పి జి ఆర్ ఎస్ జరుగుతుందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజభవన్ లో నిర్వహించే కార్యక్రమంలో సామాజిక సేవ పాల్గొనే వారికి అవార్డుల ప్రదానం జరుగుతుందని జిల్లా సంయుక్త కనెక్ట్ చెప్పారు. సమాజంలో మంచి సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులు, వివిధ సంస్థలు, సామాజిక సేవలు అందిస్తున్న వారిని గుర్తించి, అవార్డు కు ప్రతిపాదించాలని సూచించారు. తక్షణమే పేర్లు పంపాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప కలెక్టర్ లవన్న, డిపిఓ ప్రభాకర్ రావు, గుంటూరు జెడ్పి డిప్యూటీ సిఈఓ కృష్ణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.