
P G R S ku :పి జి ఆర్ ఎస్ కు 210 అర్జీలు-జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అర్జీలను స్వయంగా పరిశీలించి సంబంధిత శాఖాధికారులకు పంపిస్తూ “ప్రతి అర్జీకి సమయానుసారం, నాణ్యతతో స్పందన ఉండాలి” అని సూచించారు. కొత్తగా వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా, రెండు పర్యాయాలకుపైగా అర్జీలు ఇచ్చిన పౌరుల కోసం ఆధార్ అనుసంధానంతో పింక్ స్లిప్ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తామని తెలిపారు. ఇందులో గత అర్జీల వివరాలు, పరిష్కారం ఏ దశలో ఉందో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పింక్ స్లిప్ వచ్చిన అర్జీలను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు.అర్జీలు పరిష్కరించలేని సందర్భాల్లో, కారణాలను అర్జీదారులకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తప్పనిసరిగా తెలియజేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మండలస్థాయి అధికారులకు వీక్షణ సమావేశం ద్వారా ఈ మార్గదర్శకాలపై అవగాహన కల్పించినట్లు వివరించారు.మొంథా తుపాను నేపథ్యంలో నష్టపోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు, పరిహారం తక్షణమే పంపిణీ చేయాలని కూడా సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన, డీఆర్ఓ జి. గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.







