ఆంధ్రప్రదేశ్
PHIRANGIPURAM…జల సంరక్షణకు అధిక ప్రాధాన్యత
జల సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా శనివారం ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామ కాలువ దగ్గర పొలంలో నీటి కుంటలు తీసే కార్యక్రమానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి కుంటలు భూగర్భ జలాలను పెంపొందించడానికి ఉపయోగపడతాయన్నారు. ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రైతు నీటి కుంట తవ్వించుకోవాలని, ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశంలో నీటి సౌకర్యం, వైద్య సౌకర్యం అధికారులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.